పుష్ప కాలును బాగా గమనించారా..?

157

అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో సుకుమార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు పుష్ప అంటూ పేరు పెట్టారు. ఇందులో పుష్ప కుమార్ అనే క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పుష్ప పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పోస్టర్ ను విడుదల చేశారు. పట్టుబడ్డ వాహనం.. కింద నేలపై కూర్చున్న అల్లు అర్జున్.. పక్కనే గంధపు చెక్కలు.. చుట్టూ పోలీసులు.. గొడ్డలి ఒకటి.. కానీ ఎటువంటి భయం కూడా కళ్ళల్లో కనపడలేదు. పుష్ప కాలును గమనిస్తే ఓ ఆసక్తికర విషయం గమనించవచ్చు.. అందులో ఆరు వేళ్లు ఉంటాయి. ఇదేమైనా ఫోటోషాప్ లో చేసిన పొరపాటా.. లేక సినిమాలో పుష్ప క్యారెక్టర్ కు ఆరు వేళ్లు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

మామూలుగా సుకుమార్ ఏ చిన్న విషయానికైనా లింక్ పెట్టగల సమర్థుడు. అందుకే ఈ సినిమాలో కూడా ఆరు వేళ్లకు సంబంధించి ఏదో ఒక లింక్ ఉంటుంది. పుష్ప గెటప్ కు విశేష స్పందన వస్తోంది. పలువురు సెలెబ్రిటీలు అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాస్ లుక్ లో అల్లు అర్జున్.. ఇక వెండితెరపై ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో రష్మిక నటిస్తోంది. వీరిద్దరి మధ్యన లవ్ ట్రాక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కూడా అభిమానుల్లో మొదలైంది.