విజయ్ దేవరకొండ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. పెళ్లి చూపులు చూస్తూ అందరికి దగ్గరైయ్యాడు. వెంటనే 2017లో అర్జున్‌గా సున్నా యాంగర్ మేనేజమెంట్‌తో పిచ్చెక్కించాడు. అంతమాస్గా ఉన్న వాడు కాస్తా గీతాగోవిందం సినిమాలో గీత కొంగు పట్టుకు తిరిగాడు. వెంటనే టాక్సీవాలాగా మారి రౌడీ రాజ్యాన్ని ఏర్పరిచాడు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా ఈ దుస్తులకు బన్నీ కూడా ఫిదా అయిపోయాడు. తాను విజయ్‌ని ‘రౌడీ’ బ్రాండ్ దుస్తులు అడిగానని, తనకోసం స్పెషల్‌గా కొన్ని దుస్తులు డిజైన్ చేసి పంపించాడని అల్లు అర్జున్ ఓ సందర్భంలో తెలిపారు..
తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి బన్నీ కోసం దుస్తులు పంపించారట. ఆ దుస్తుల్లో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసిన బన్నీ.. ‘ఇలాంటి అందమైన, సౌకర్యవంతమైన దుస్తులు పంపించిన నా బ్రదర్ విజయ్ దేవరకొండ, రౌడీ క్లబ్ టీమ్‌కు ధన్యవాదాలు. నాపై నువ్వు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు బ్రదర్. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
దాంతో ఆ ఫొటోలు నిట్టింట హల్ చల్ చేశాయి. అయితే దానిపై రౌడీ హీరో తిరిగి రిప్లై ఇచ్చాడు. స్టన్నింగ్ అన్నో అంటూ తన రౌడీ స్టైల్లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం అనన్య హీరోయిన్గా పూరీ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.