Homeసినిమా వార్తలుఅల్లు అర్జున్ భారీ ప్లాన్.. త్రివిక్రమ్ కంటే ముందే వేరే డైరెక్టర్ తో సినిమా.!

అల్లు అర్జున్ భారీ ప్లాన్.. త్రివిక్రమ్ కంటే ముందే వేరే డైరెక్టర్ తో సినిమా.!

Allu Arjun and director Atlee movie confirmed, Allu Arjun upcoming movie news, Pushpa 2 The Rule Shooting update, Pushpa 2 shooting, Allu Arjun Trivikram movie, Allu Arjun new movie.అల్లు అర్జున్ భారీ ప్లాన్.. త్రివిక్రమ్ కంటే ముందే వేరే డైరెక్టర్ తో సినిమా.

Allu Arjun and director Atlee movie confirmed, Allu Arjun upcoming movie news, Pushpa 2 The Rule Shooting update, Pushpa 2 shooting, Allu Arjun Trivikram movie, Allu Arjun new movie.

అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే త్రివిక్రమ్ (Trivikram) ముచ్చటగా మూడోసారి సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ సినిమాని ఏప్రిల్ 2024 కల్లా ముగించి తన తదుపరి సినిమాని మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని జనవరిలో విడుదలకు  సిద్ధం చేస్తున్నాడు. 

దీని ప్రకారం చూసుకుంటే ఇద్దరు ఏప్రిల్ తర్వాత ఫ్రీ అవుతారు కనుక సినిమాని ముందుగానే ప్లాన్ ప్రకారం ఇద్దరి కొత్త సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు బన్నీ ప్లాన్ మారిందట. వీళ్ళ ఇద్దరి సినిమా కొత్త స్క్రిప్ట్ రెడీ అవ్వటానికి మినిమం 6 నెలల టైం పడుతుంది. అందుకనే ఈ ఆరు నెలల గ్యాప్ లో  త్రివిక్రమ్ సినిమా కంటే ముందే వేరే దర్శకుడుతో సినిమా చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Allu Arjun and Atlee Movie Confirmed

ప్రస్తుతం జరుగుతున్న పుష్ప 2 షూటింగు జనవరి కల్లా కంప్లీట్ చేసి కొత్త డైరెక్టర్ సినిమా పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారట. అయితే ఈ మధ్యలోనే కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్టు అలాగే దర్శకుడు గురించి బన్నీ వెతకడం స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.  ఇప్పుడు దర్శకుడు అట్లీ తో సినిమాని అల్లు అర్జున్ తెరపైకి తీసుకురావడం జరిగింది. 

అందుకోసమే కొన్ని రోజుల క్రితమే బన్నీ ముంబై వెళ్లి అట్లీ తో సినిమాకి కావాల్సిన స్క్రిప్టు వర్క్ గురించి మాట్లాడి వచ్చినట్టు  సమాచారం అందుతుంది. ఇక అన్ని అనుకున్నట్టు కుదిరితే పుష్ప 2 సినిమాని జనవరి కల్లా ముగించి.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అట్లీ సినిమా షూటింగు ముగించి విడుదలకు సిద్ధం చేయాలని ప్లాన్ చేశారంట. ఈ విధంగా పుష్పాకి కేటాయించిన రెండు సంవత్సరాల టైం ని కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ కి బాక్స్ ఆఫీస్ వద్ద వరుస హిట్ సినిమాలు కన్ఫామ్ అయినట్టే.. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY