Pushpa 2 shooting video leaked: అల్లు అర్జున్ అలాగే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప. మొదటి పార్ట్ భారీ స్థాయిలో విజయం అవ్వగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీనికి సీక్వెల్ అయిన పుష్ప 2 సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగు వివిధ లొకేషన్స్ లో శరవేగంగా జరుగుతుంది.
Pushpa 2 shooting video leaked: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాని సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని తీయడం జరుగుతుంది. పుష్ప 2 సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదంటే మార్చిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. 400 పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో జగపతిబాబు అలాగే మరికొందరు కీలకమైన పాత్రలో చేస్తున్నారు.
అయితే ఇప్పుడు పుష్ప2 షూటింగ్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏకంగా 500 పైనే లారీలను షూటింగ్ కోసం ఒక ఖాళీ ప్లేస్ లో పెట్టడం మనం చూడవచ్చు. ఇంత భారీ మొత్తంలో షూటింగ్ కోసం మేకర్స్ ఖర్చు పెట్టడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇక విశ్లేషకులు అయితే ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని అలాగే అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ లో ఎక్కువ చూడబోతున్నట్టు చెబుతున్నారు. “పుష్ప” మొదటి భాగంలో అల్లు అర్జున్ కనిపించడంతో పాటు స్మగ్లింగ్‌కు సంబంధించిన రకరకాల ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రెండో పార్ట్ దానికి మించిన ప్లాన్ చేసినట్లు సమాచారం. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. వీళ్ళతోపాటు ఇక, సునీల్, అనసూయ లాంటివారు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు.