ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన కలిసి నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప (Pushpa). సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ఆడింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సినిమా ప్రశంసలందుకుంది. పుష్పా హిందీలో (Pushpa Hindi) కూడా అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

అంతకుముందు అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలను హిందీలో డబ్ చేసిన యూట్యూబ్ ఛానల్ లో ఎక్కువ చూసే వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా థియేటర్లో రిలీజ్ చేసేటప్పటికి ఎప్పుడూ లేనంతగా అల్లు అర్జున్ పుష్ప (Pushpa Hindi) సినిమాకి ఆదరణ లభించింది. దీనితో హిందీలో పుష్పా (Pushpa Hindi) కు పోటీగా రిలీజ్ అయిన సినిమాలు కూడా పక్కకు జరగాల్సి వచ్చింది. రణవీర్ సింగ్ యొక్క 83 మూవీ కూడా అంత ఆదరణ లభించలేదు.
అల్లు అర్జున్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్పా (Pushpa) సినిమా మా 6 వారంలో కి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వారంలో గానూ పుష్పా (Pushpa) సినిమా రూ.6 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ని ప్రభాస్ నటించిన బాహుబలి 2తో (Baahubali 2) పోలిస్తే నికరంగా రూ.5.40 కోట్లు వసూలు చేసింది. దీనితో పుష్పా (Pushpa) కలెక్షన్స్ ప్రభాస్ సినిమా రికార్డుని చెరిపివేసింది.
పుష్ప (Pushpa) బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా అన్ని ఏరియాల్లో రాబట్టలేకపోయింది. తెలుగు వెర్షన్ ఆంధ్ర మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవడంలో విఫలమైంది. ఏది ఏమైనప్పటికీ, పుష్పా సినిమా కొవిడ్ ఈ టైంలో కూడా రికార్డును సొంతం చేసుకుంది.

బాహుబలి సిరీస్ మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తరలించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ప్రభాస్ కూడా అన్ని భాషల్లోనూ అమితంగా ఫాలోవర్స్ పెరిగారు. పుష్ప ఇప్పుడు అనేక బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి కొత్త మైలురాళ్లను నెలకొల్పుతోంది.