ఖరీదైన విల్లా కొనుకున్న సుకుమార్.. ఎంతో తెలుసా ?

0
1206
Arjun Pushpa director Sukumar new villa cost 12 crores

విలక్షణ దర్శకుడు సుకుమార్ చివరిగా రంగస్థలం సినిమా తెరకెక్కించాడు. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు ఏళ్ళు కావస్తోంది. ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం `పుష్ప`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా మైత్రీ మూవీమేకర్స్‌తో పాటు ముత్యంశెట్టి మీడియా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో మొదలైంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ రఫ్ లుక్ లో కనిపిస్తాడు.

అల్లు అర్జున్ పాల్గొనగా పలు కీలక ఘట్టాలని ఫారెస్ట్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ ఎవరు అనే విషయం మాత్రం ఎప్పటికీ క్లారిటీ లేదు ఆ విషయాన్ని పక్కన పెడితే సుకుమార్ ఇప్పుడు ఒక భారీ విల్లా కొనుగోలు చేసాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 12 కోట్లతో విల్లాని కొండాపూర్‌లోని ప్రైమ్‌ ఏరియాలో తీసుకున్నారని తెలిసింది. ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేశారట. `పుష్ప` షూటింగ్‌కి బ్రేకిచ్చి హైదరాబాద్ చేరుకున్న సుకుమార్ కొత్త విల్లాలోకి ఎంట్రీ ఇచ్చారట. ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన పూజలో హీరో బన్నీతో పాటు టీమ్ మెంబర్స్‌.. ఇండస్ట్రీ వర్గాలు కూడా పాల్గొన్నట్టు తెలిసింది.

మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌కి దగ్గరలోనే సుకుమార్ విల్లా వుంటుందట. అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటిలో ఈ విల్లాని సుకుమార్ సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. సుకుమార్ 12 కోట్ల విల్లా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతానికి సుకుమార్ దర్శకుడిగా నే కాక నిర్మాతగా కూడా చాలా సినిమాల్లో ఒప్పుకుని చేస్తూ పోతున్నాడు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ ఆయన అవకాశం ఇచ్చి మరి దర్శకులు చేస్తూ పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here