పుష్ప…ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్..!

0
116
Allu Arjun pushpa first single out on August 13

Allu Arjun Pushpa Songs: అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ నుండి వీడియో వరకూ సోషల్ మీడియా ను షేక్ చేయడం జరిగింది. ‘పుష్ప’ చిత్రం నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే ఫస్ట్ సాంగ్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ‘దాక్కో దాక్కో మేక’ పాటను 5 ప్రధాన భాషల్లో 5గురు ప్రముఖ సింగర్స్ పాడనున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. హిందీ లో విశాల్ దడ్లాని, కన్నడ లో విజయ్ ప్రకాశ్, మలయాళం లో రాహుల్ నంబియార్, తెలుగు లో శివం, తమిళ్ లో బెన్ని దయాల్ లు పాట ను పాడుతున్నారు.

ఇకపోతే దేవిశ్రీప్రసాద్ – అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటే మ్యూజిక్ పరంగా మరో స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు. ఇప్పుడు ‘పుష్ప’ మూవీ ఆల్బమ్ పై కూడా అలాంటి అంచనాలే నెలకొన్నాయి. అయితే ఐకాన్ స్టార్ గా బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న మూడవ చిత్రం కావడం తో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ పలువురు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.