అల్లు అర్జున్ ‘పుష్పారాజ్’.. క్రేజీ అప్డేట్!

0
41
Allu Arjun Pushpa movie shooting update and new release date

Allu Arjun Pushpa: అల్లు అర్జున్.. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ‘అలవైకుంఠపురంలో’ మూవీలో స్టైలిష్ గ కనపడిన ఐకాన్ స్టార్ ఇప్పుడు ఆద్యంతం ఆకట్టుకునేలా నేచురల్ రియల్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ పుష్పారాజ్ గా రాబోతున్నాడు. ఈ హ్యాట్రిక్ కాంబో హిట్ అందుకుంటుందా లేదా అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాడు. అయితే అల్లు ఫ్యాన్స్ హైపర్ యాక్టీవ్. అందుకే సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న వార్త తెలిసినా రచ్చ చేసేస్తారు. ఇపుడు అదే చేస్తున్నారు ఇంక సినిమా రిలీజ్ కాకముందే సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లు పోస్టర్స్ – టీజర్స్ – ట్రైలర్స్ తోనే రచ్చ చేస్తున్నారు.

ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ రఫ్ లుక్కులో లారీడ్రైవరుగా కనిపించనున్నాడు. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పుష్ప పోస్టర్లు- టీజర్ చూస్తేనే సినిమా అడవుల్లో అక్రమంగా జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ సెన్సేషన్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. జులైలో పుష్ప తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.