పుష్ప కోసం మహారాష్ట్రలో అల్లు అర్జున్‌ పర్యటన

Allu Arjun Rahsmika Mandanna Pushpa shooting update

Allu Arjun Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మితం కానున్న ఈ సినిమా కోసం ఇప్పుడు బన్నీ లొకేషన్స్‌ సెర్చ్‌లో ఉన్నారట. అందులో భాగంగా బన్నీ ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు చేరుకున్నారు. బన్నీ కుటుంబ సభ్యులు కూడా ఈ జర్నీలో ఆయనతో ట్రావెల్‌ అవుతున్నారు. శనివారం కుంటాల జలపాతంను సందర్శించిన బన్నీ ఇప్పుడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ లో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. దీంతో గత ఆరు నెలల నుండి షూటింగ్ చేయడం సాధ్యపడలేదు. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ‘పుష్ప’ కూడా త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతాడని వార్తలు వస్తున్నాయి.

Allu Arjun Pushpa movie shooting update Allu Arjun Pushpa movie shooting update