షూటింగు మొదలెట్టేసిన ‘PUSHPA’ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే..!

0
43
Allu Arjun Pushpa Team resume shoot in Hyderabad from today

Allu Arjun Pushpa Shoot: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ  పుష్ప సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. రష్మిక (Rashmika) నాయిక. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ పేరుతో ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

ఈ సినిమాలో, అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ (aishwarya rajesh) కనిపించనుంది. అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే పుష్ప రిలీజ్ క్రిస్టమస్ 2021 కి ప్లాన్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.