అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి కూడా గాసిప్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తెచ్చిన అల్లు అర్జున్ ఎలాగైనా తన మార్కెట్ ను నేషనల్ వైడ్ గా పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాలో అతి ముఖ్యమైన విలన్ పాత్రపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు సుకుమార్ ఎలాంటి విలన్ ను సెలెక్ట్ చేసుకుంటాడు అనే ఊహ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తోంది.
ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో విలన్ ఇతనే అంటూ అనేక రకాల పేర్లు వినిపించాయి. మొదట విజయ్ సేతుపతి నటించడానికి ఒప్పుకున్నప్పటికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత బాబీ సింహా, అరవింద్ స్వామి, చియాన్ విక్రమ్ వంటి వాళ్ళ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఇక ఫైనల్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ ను ఫిక్స్ చేసినట్లు మరో కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా విలన్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్న విషయం తెలిసిందే.