Allu Arjun Special Look From Pushpa shooting Sets

Allu Arjun Pushpa Update: అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప. స్పెషల్ గెటప్‌తో ఈ సినిమా సెట్స్‌పై అడుగుపెట్టారు స్టైలిష్ స్టార్. గత ఏడాదిగా ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం అయ్యింది. షూటింగ్స్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ వచ్చాక కూడా చాలా గ్యాప్ తీసుకొని అన్ని జాగ్రత్తలతో రంగంలోకి దిగింది పుష్ప టీమ్. అల్లు అర్జున్, ఇతర నటీనటులతో నవంబర్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో తాజాగా.. ”పుష్పరాజ్ వచ్చేసినాడు” అంటూ అడవిలో ఎంట్రీ ఇస్తోన్న అల్లు అర్జున్ ఫోటోను విడుదల చేసింది చిత్ర యూనిట్. పుష్పరాజ్ అలా అడవిలో ముందుకు వెళ్తున్న ఫోటోను వెనుక నుంచి చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సుకుమార్ ఈ సినిమాలో బన్నీని చాలా విభిన్నంగా చూపించాడు. రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న నేపథ్యంలో ఈ బ్యాక్ లుక్ పోస్టర్ మరింత ఆకర్షనీయంగా మారింది.

పుష్ప సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రఫ్ లుక్ లో కనిపిస్తూ చిత్తూరు యాసలో బన్నీ మాట్లాడుతూ ఉంటాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ సుకుమార్. చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.