allu arjun sukumar clarifies about AA20 movie title
allu arjun sukumar clarifies about AA20 movie title

(allu arjun sukumar clarifies about AA20 movie title) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో చిత్రం తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇదే జోష్ ను సుకుమార్ తో చేయబోయే మూవీ లో చూపించబోతున్నాడు. ఆర్య , ఆర్య 2 చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కావడం తో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈచిత్రానికి సంబంధించిన ఒక టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్ సైట్స్ లో ఈ మూవీకి టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుండడం తో ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ కావడం తో చిత్ర యూనిట్ ఈ టైటిల్ ఫై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదిక టైటిల్‌ విషయంలో జరగుతున్న ప్రచారం అంతా ఒట్టి పుకారేనంటూ కొట్టి పారేశారు. ఇక అల్లుఅర్జున్‌, సుకుమార్ కలిసి చేయబోయే చిత్రంలో సుకుమార్ బన్నీని చాలా స్టైలిష్‌గా పాష్‌గా చూపించబోతున్నారని సమాచారం. గతంలో బన్నీ కాస్త మాస్ లుక్‌లో చేసిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడలేదు. నా పేరు సూర్య, ఇంకా ఇలా కాస్త మాస్‌గా ఉన్న చిత్రాలు బన్నీ పెద్దగా హిట్ కాలేదు. మరి సుకుమార్ బన్నీని ఎలా చూపించబోతున్నారో తెరమీదే చూడాలి.