బన్నీ మాస్టర్‌ ప్లాన్ బాలీవుడ్‌ను “ఢీ” కొట్టేందుకు

0
376
Allu Arjun Sukumar Master Plan For Pushpa Bollywood Version

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెల్ల మెల్లగా తన మార్కెట్ ను సౌత్ తో పాటు నార్త్ లో కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే అతనికి మలయాళంలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా వైకుంటపురంలో మరియు రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ లో కూడా బన్నీకి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాల హిందీ వెర్షన్లకు యూట్యూబ్లో 200మిలియన్ వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ పుష్పతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాదిలో నాలుగు భాషల్లో విడుదల కానుంది. అదే విధంగా హిందిలోనూ రిలీజ్‌ చేసేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం.

ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేసేందుకు ఓ టీంను కూడా ఏర్పాటు చేసినట్టు టాక్.’పుష్ప’ కు సంబంధించిన ప్రమోషన్లు తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే సారి మొదలుకాబోతున్నాయట. దీనికి కారణం టాలీవుడ్‌లో అగ్రహీరోల మధ్య పెరుగుతున్న పోటీనే దీనికి కారణమని టాక్‌. అయితే.. ఇక్కడి హీరోలు దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఎలేందుకు అటు కన్నేసిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే ప్రభాస్‌ ఓ రేంజుకెళ్లాడు. ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో జరుగుతుంది.

Previous articleమాల్దీవుల్లో రచ్చ లేపుతున్న రకుల్‌..!
Next articleరెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. అమ్మాయి ఎవరో తెలుసా..?