వారణాసికి షిఫ్ట్ అవుతున్న పుష్ప షూటింగ్..!

0
351
Allu Arjun Sukumar Pushpa Team planning another schedule in Varanasi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. రంప చోడవరం అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.కరోనా కారణంగా పుష్ప ప్లానింగ్ అంత దెబ్బతింది. అయినప్పటికీ సుకుమార్ మళ్ళీ ప్లాన్ చేసుకుని పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.

అయితే ఫస్ట్ షెడ్యూల్ అడవుల్లో ప్లాన్ చేసిన.. సెకండ్ షెడ్యూల్ ని వారణాసిలో ప్లాన్ చేసిందట పుష్ప టీం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మారేడుమిల్లి అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. కాగా, డిసెంబర్ 18 నుంచి వారణాసిలో ‘పుష్ప’కి సంబంధించి ఓ పాటని భారీ ఎత్తున చిత్రీకరించడానికి సుక్కు అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. దాని కోసం ఇప్పటికే సుకుమార్ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెల్లని పట్టుకొచ్చాడు. భారీ పారితోషికముతో ఊర్వశి అల్లు అర్జున్ పక్కన మాస్ స్టెప్స్ వేయనుంది. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ గీతం సాగుతుందని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఈ పాటకి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

ఆ వారణాసి షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ తో పాటుగా.. ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రకరణ కూడా జరగబోతుందట. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తరువాత బన్నీ, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’.. వారిద్దరికి హ్యాట్రిక్ వెంచర్ గా నిలుస్తుందేమో చూడాలి. విలన్ విషయంలో మాత్రం సుకుమార్ తేల్చకుండా ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నాడు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘పుష్ప’ చిత్రాన్ని నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here