బన్నీ `పుష్ప` సినిమా షూటింగ్ ఆగిందట..నిజమేనా?

0
342
Allu Arjun Sukumar Pushpa Team Stopped Shooting And Came Back To Hyderabad

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం పుష్ప. ముత్యంశెట్టి మీడియా సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోవిడ్ కారణంగా గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే మారేడుమిల్లిలోని డీప్ ఫారెస్ట్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని చిత్ర బృందం ప్రారంభించింది. ఈ సినిమాని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించడం విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అయితే.. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు. బన్నీ మాస్ గెటప్ లో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా ఇందులో నటిస్తున్నారు. మారేడుమిల్లి సెట్ లో బన్నీ మాసిన బట్టలతో వున్న ఓ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 150కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పినప్పటికీ… అంతకు మించి.. యూనిట్ మెంబర్స్ సెట్ లో ఉండడంతో కొంత మందిలో కరోనా లక్షణాలు కనిపించాయట. అంతే.. వెంటనే షూటింగ్ ఆపేశారట. అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారని తెలిసింది. మళ్లీ ఎప్పుడు పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటున్నారు.

ఇలా షూటింగ్ ఆపేయాల్సి రావడంతో సుకుమార్ బాగా ఫీలవుతున్నారట. పుష్ప షూటింగ్ కరోనా వలన ఆగిపోవడంతో సెట్స్ పై ఉన్న భారీ చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్, ఆచార్య తదితర చిత్రాలకు టెన్షనే అని చెప్పచ్చు. శేషాచలం ఫారెస్ట్ నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ మూవీని సుకుమార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here