“పుష్ప” కొత్త షెడ్యూల్ అప్డేట్

0
57
Allu Arjun, Sukumar To Shoot Pushpa In Goa from July 5th

Pushpa Shooting: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. సమాచారం ప్రకారం గోవాలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది.

ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో పుష్ప రాజ్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ ను కూడా చిత్రీకరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. పుష్ప గోవా షెడ్యూల్ తరువాత అల్లు అర్జున్ ఆగస్టులో “ఐకాన్” షూట్‌లో చేరే అవకాశం ఉంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది.