Allu arha birthday: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. 2016, నవంబర్ 21న పుట్టిన అర్హ నేటితో నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి ప్రవేశించింది.నేడు అర్హ బర్త్ డే .. అందుకే అల్లు అర్జున్ ఇలా స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు. ఇంతకీ ఆ బుల్లి పెట్టెలో అర్హ కోసం ఎలాంటి గిఫ్ట్ దాగి ఉందో?

అర్హకు సంబంధించిన ప్రతి ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ ని అభిమానులకు షేర్ చేస్తుంటారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌’ అని కామెంట్ చేస్తూ కూతురికి గిఫ్ట్‌ ఇస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్‌‌ చేశారు. అంజలి సినిమా నుంచి అంజలి అంజలి పాటకు అర్హ అభినయం డ్యాన్సులు చేసిన స్పెషల్ వీడియో. దీంతో పాటు అర్హను గుర్రం ఎక్కించిన ఫోటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేశారు. బన్ని ఎంతో ఆనందానికి ఉద్వేగానికి గురయ్యారు.