అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ సంబంధించిన పదంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నట్టు ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది. తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి చురుకైన నేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 19వ తేదీన నాగార్జున సాగర్‌లో సరికొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పార్టీ ఆఫీస్ ని అల్లు అర్జున్ చేత ఓపెనింగ్ చేపిస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఈ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అల్లు అర్జున్ రావటంతో లక్షల్లో జనాలు వస్తారంటూ అది పార్టీకి అలాగే ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అంట.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు చంద్రశేఖర్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పార్టీ కార్యాలయం, ఫంక్షన్ హాల్‌ను నిర్మించినట్లు సమాచారం. సమాచారం మేరకు ఈ పార్టీ ఆఫీస్ ని అలాగే ఫంక్షన్ హాల్ ని ఈ నెల 19న ఈ రెండు సంస్థలను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు.

ఈ విధంగా తెలంగాణా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అల్లు అర్జున్ తన మామగారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ రెడ్డి మెగా భోజనాన్ని ప్లాన్ చేస్తున్నారని, దాదాపు 10,000 మంది వరకు హాజరవుతారని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఊహాగానాలుగానే మిగిలిపోయింది.