Allu Arjun Trivikram ala vaikuntapuramloo Teaser Review..
Allu Arjun Trivikram ala vaikuntapuramloo Teaser Review..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇద్దరూ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 న విడుదల కాబోతుంది. ఏడాదిన్నరకి పైగా అల్లు అర్జున్ ఎలాంటి మూవీ చేయకుండా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు ఇప్పుడు అల వైకుంఠ పురంలో టీసర్ తో అభిమానులను పలకరించాడు.

‘మీ నాన్న పెళ్ళికూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను’ అనే డైలాగ్ తో వచ్చే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలింగ్, యాటిట్యూడ్, భారీ స్టార్ కాస్ట్ ఇలా టీసర్ లో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూపెట్టిన టీసర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ ఓ రేంజ్ లో కుమ్మేశాడు అని చెప్పాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పై అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి. ఈ టీజర్ చాలా స్టైలిష్ గా సాగింది. ‘పి.ఎస్.వినోద్’ అందించిన సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అనే చెప్పాలి.

ఓవరాల్ గా టీసర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ టేకింగ్ దుమ్ము లేపగా అల్లు అర్జున్ గెటప్ అండ్ స్టైలింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఓవరాల్ గా అల వైకుంఠ పురంలో అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎలా ఉండబోతుందో టీసర్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా చూపెట్టింది.