Allu Arjun Trivikram Ala Vaikunthapurramloo Butta Bomma Song Teaser
Allu Arjun Trivikram Ala Vaikunthapurramloo Butta Bomma Song Teaser

(Allu Arjun Ala Vaikunthapurramloo Butta Bomma Song )మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. బ్యూటీ పూజా హెగ్డే బన్నీకి జంటగా నటిస్తుండగా టబు, హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సాంగ్స్ మరియు త్రివిక్రమ్ మార్క్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’, ‘ఓ మై గాడ్ డాడీ’ పాటలకు జనాల నుంచి విశేషమైన స్పందన లభించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు నాలుగో సింగిల్ బుట్టబొమ్మ సాంగ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. సింపుల్ లిరిక్స్ తో ఆకట్టుకునే విధంగా ఉన్నది. దీనిని సంబంధించిన ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అర్మాన్ మాలిన్ పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. త్రివిక్రమ్… అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇది కూడా అదే కోవలో హిట్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.