Allu Arjun Trivikram Ala Vaikunthapurramuloo Telugu movie Teaser Date Locked
Allu Arjun Trivikram Ala Vaikunthapurramuloo Telugu movie Teaser Date Locked

సంక్రాంతికి సందడి చేయడానికి టాలీవుడ్ టాప్ హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబులు పోటీ పడుతున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురంలో’ ఒక్కో రోజు తేడాతో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ దూసుకొని పోతోంది. ఇప్పటికే టీజర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే రిలీజ్ ముందు వరకూ ఒక్కో సోమవారం ఒక్కో అప్డేట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యింది.

‘అల.. వైకుంఠపురంలో’ నుండి ఇప్పటిదాకా చిన్న చిన్న అప్డేట్స్.. మూడు లిరికల్ సాంగ్స్ విడుదల అయ్యాయి. ఇక మిగిలింది.. టీజర్, ట్రైలర్ మాత్రమే..! ఇవి ఎప్పుడు వస్తాయా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. టీజర్ విడుదలకు ముహూర్తం పెట్టేశారు. డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు ప్రకటించారు

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురం లో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా పైనా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరీర్ కు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం.

ఇంతకు ముందు అల్లు అర్జున్ నుండి వచ్చిన దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇక త్రివిక్రమ్ సినిమాలంటేనే స్టార్ క్యాస్టింగ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రల్లో కూడా పెద్ద పెద్ద నటులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా టబు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో కనిపించనుండడం కూడా సినిమాకు పెద్ద ప్లస్ గా నిలిచింది. యంగ్ హీరోలైన నవదీప్, సుశాంత్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తూ ఉండగా.. మరో హీరోయిన్ నివేతా థామస్ కూడా నటిస్తోంది.