Allu Arjun-Trivikram Srinivas film titled 'Nanna
Allu Arjun-Trivikram Srinivas film titled 'Nanna

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్టార్ట్ కాకముందు ఆ సినిమా కథపై చాలా రూమర్స్ వస్తాయి.అది తండ్రి కొడుకుల కథ అని,అబద్దానికి సంబందించిన కథ అని..ఇలా చాలా రూమర్స్ వచ్చాయి.అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రి కొడుకుల మధ్య నడిచే కథ అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది.సినిమాలో ఉన్న ఆ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ సినిమాకి టైటిల్ గా నేను…నాన్న అనే టైటిల్ అనుకుంటున్నారు అని టాక్.

నిజానికి అలకనంద అనే టైటిల్ వినడానికి బావుంది.త్రివిక్రమ్ అ అక్షరం సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ఉంది.ఈ సినిమాలో ఆ పాత్రలో టబు నటిస్తుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా కలిసొస్తుంది.కానీ నేను…నాన్న అనే టైటిల్ త్రివిక్రమ్ సినిమా రేంజ్ కి కానీ,బన్నీ రేంజ్ కి కానీ తగిన విధంగా లేదు అనేది పబ్లిక్ టాక్.కాకపోతే ఇంతవరకు త్రివిక్రమ్ సినిమాల విషయంలో ముందు ఏవైతే లీక్స్ వినిపిస్తాయో అవే టైటిల్స్ గా ఫిక్స్ అవుతాయి.మరి కథ ని నమ్మి టైటిల్ ని లైట్ తీసుకున్నారా? ,లేక ఆ టైం కి టైటిల్ మారుస్తారా అనేది చూడాలి.ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.