Allu Arjun Upcoming Movies: Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2. ఎవరు ఊహించని విధంగా పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టించిన తర్వాత దాని సీక్వెల్ గా వస్తున్న మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సంవత్సరం వేసవికాలంలో హాట్ సమ్మర్ కూల్ ట్రీట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Allu Arjun Upcoming Movies: Pushpa 2: మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే గత కొద్ది కాలంగా ఈ పుష్ప మరియు దాని సీక్వెల్ కోసం బాగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ తరువాత గ్యాప్ లేకుండా వరుసగా మూవీస్ తో మరింత బిజీ కాబోతున్నారు.
పుష్ప సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లు అర్జున్ తన 22 మూవీ చేయనున్నారు. ఆ తర్వాత అతని 23వ చిత్రం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఉండబోతున్నట్లు అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రాన్ని టి సిరీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. ఆ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్లో చేయడానికి బన్నీ సిద్ధపడ్డట్టు తెలుస్తుంది.
కానీ ఈ మూవీ కన్ఫామ్ అవ్వనా పట్టాల పైకి రావడానికి కనీసం రెండేళ్ల సమయం సులభంగా పడుతుంది. దీని తర్వాత ప్రశాంత్ మీరు డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మూవీ కోసం ప్రశాంత్ నిన్ను గీత ఆర్ట్స్ సంప్రదించడానికి ట్రై చేస్తున్నారు…. మరి అంత లాంగ్ గ్యాప్ వెయిట్ చేసే టైం ప్రశాంత్ నీలికి ఉంటే ఈ చిత్రం కూడా ఓకే అయ్యే ఛాన్స్ ఉంది.

పుష్ప మూవీ తరువాత అల్లు అర్జున్ ఇమేజ్ పాన్ ఇండియన్ లెవెల్ లో ఎస్టాబ్లిష్ అవ్వడమే కాకుండా అతనికి ఉన్న డిమాండ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. దీనికి తోడు అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ కూడా విపరీతంగా పెరిగింది.. దీంతో ప్రస్తుతం అతనిపై కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికి కూడా బడా సంస్థలు వెనుకాడడం లేదు.