లీకైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సాంగ్ షూటింగ్

0
252
allu-arjuns-pushpa-video-gets-leaked
allu-arjuns-pushpa-video-gets-leaked

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంట్ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతే వేగంగా షూటింగ్ సెట్ లోని ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకొని షూటింగ్ చేస్తుండ‌గా, మూవీకి సంబంధించి ఇలా లీకులు చేయ‌డాన్ని నిర్మాత‌లు చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. తాజాగా ‘పుష్ప’ షూటింగ్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. పుష్ప మేక‌ర్స్ ఓ సాంగ్‌ ను న‌ది ఒడ్డున చిత్రీక‌రిస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.