allu arvind geetha arts change hero Raj tarun to Nikhil for up coming movie 2020
allu arvind geetha arts change hero Raj tarun to Nikhil for up coming movie 2020

రాజ్ తరుణ్.. ఈ యంగ్ హీరో వరుస విజయాలతో దూసుకుని వెళ్ళాడు. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు అతడి కెరీర్ ను కుదిపేశాయి. దీంతో అతడు మినిమమ్ గ్యారెంటీ హీరో అన్న ముద్ర కాస్తా తుడిచిపోయే అవకాశం వచ్చింది. అతడి చేతిలో ఉన్నది దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమా మాత్రమే..! ఈ సినిమాను ఈనెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

హీరో నిఖిల్.. కెరీర్ మొదట్లో ఓ హీరోను ఇమిటేట్ చేసేవాడు అన్న పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఎదురుదెబ్బలు తగిలాక స్వామి రారా అన్న సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుండి కంటెంట్ ను నమ్ముకున్నాడు నిఖిల్. అందుకే వరుస హిట్స్ వచ్చాయి. నోట్ల రద్దు సమయంలో కూడా హిట్ అందుకున్న ఏకైన హీరో నిఖిల్ మాత్రమే..! తాజాగా ‘అర్జున్ సురవరం’తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమా ఇతడు హీరోగా సుకుమార్ – గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఒక సినిమాను నిర్మించనున్నారు.

ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే.. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్ చేయాల్సి ఉంది. ఎప్పుడైతే రాజ్ తరుణ్ మార్కెట్ బాగా తగ్గిపోయిందో.. హీరో అవకాశం నిఖిల్ కు దక్కిందని అంటున్నారు. రాజ్ తరుణ్ – సూర్యప్రతాప్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘కుమారి 21F’ అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది.. తన తదుపరి సినిమా మళ్లీ రాజ్ తరుణ్ తోనే ఉంటుందని ఇటీవల సూర్యప్రతాప్ చెప్పాడు. కానీ నిఖిల్ ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.