allu family big announcement on allu ramalingaiah 99th birth anniversary

Allu Arjun Allu Studios: తెలుగు తెర‌పై హాస్య‌పు జ‌ల్లు అల్లు అనే నానుడి కొన్ని సంవ‌త్స‌రాలుగా వుంటూనే వుంది. హాస్యానికి చిరునామా అయిన అల్లు రామ‌లింగ‌య్య 99వ జ‌యంతి నేడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తన ముగ్గురు కుమారులతో కలిసి ఓ భారీ స్టూడియో నిర్మించబోతున్నారు. ఈ రోజు (అక్టోబర్ 1) తన తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది అల్లు ఫ్యామిలీ.

హైద‌రాబాద్ లోని గండిపేట్ ప్రాంతంలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు అల్లు అర‌వింద్ తోపాటు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్ర‌క‌టించారు. బిజినెస్ రంగంలో అల్లు అరవింద్ స్కెచ్చేశారంటే దానికి తిరుగే ఉండదు. టాలీవుడ్ బడా నిర్మాతగా ఎన్నో విజయాలందుకొని లాభాలు గడించిన ఆయన సినిమా రంగంపై ఉన్న ప్రేమతో ఈ స్టూడియో ప్రారంభిస్తున్నారట. సర్వ హంగులతో మోడ్రన్ సినిమా షూటింగులకు కేరాఫ్ అడ్రస్ అయ్యేలా ఈ స్టూడియో నిర్మించాలని ఆయన పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఫిల్మ్ మేకింగ్ కు అనుకూలంగా ఉండేలా ఆర్ట్ ఫిలిం స్డూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. స్డూడియో నిర్మాణ పనులు కూడా త్వ‌ర‌లోనే షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ స్టూడియోకు సంబంధించిన అన్ని వివరాలను అల్లు అరవింద్ అతిత్వరలో ప్రకటించనున్నారు.