Homeసినిమా వార్తలుఅల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో టీజర్ టాక్

అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో టీజర్ టాక్

Allu Sirish Urvashivo Rakshashivo Teaser: అల్లు శిరీష్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమా మన ముందుకు వస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. కొన్ని నెలల క్రితం అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన తర్వాత ఈ రోజు ఊర్వశివో రాక్షసివో టీజర్ నీ విడుదల చేశారు.

ఉర్వశివో రాక్షసివో (Urvashivo Rakshashivo Teaser) చిత్రానికి విజేత సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని చెప్పొచ్చు.టీజర్ మొత్తం ఆకట్టుకునేలా ఉంది.టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతుంది.

Allu Sirish Next Urvashivo Rakshashivo Teaser Released
Allu Sirish Next Urvashivo Rakshashivo Teaser Released

అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది.స్మాల్ గ్యాప్ తర్వాత శిరీష్ నుంచి ఈ చిత్రం రావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన పోస్టర్స్,టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అనే నమ్మకం కలుగుతుంది.

ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు.ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles