Amala Comments On Agent Movie: భారీ అంచనాల మధ్య చాలా లాంగ్ తర్వాత విడుదలైన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) మూవీ ఏజెంట్. ఏప్రిల్ 28న గ్రాండ్ గా మూవీ రిలీజ్ అయితే అయ్యింది కానీ ఊహించిన విధంగా మాత్రం సినిమా గురించి టాక్ నడవడం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమా గురించి నెగటివ్ టాప్ ఏ ఉంది. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైనే పాపం అఖిల్ కష్టపడ్డాడు. ప్రస్తుతం అఖిల్ తో పాటుగా సురేందర్ రెడ్డి ని కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ట్రోల్ చేసేవారిలో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఉండడమే ఇందులో విచిత్రం.
Amala Comments On Agent Movie: అఖిల్ (Akhil Akkineni) రెండేళ్ల కష్టం ఫెయిల్ అయింది అన్న బాధ కంటే కూడా ప్రస్తుతం అక్కినేని కుటుంబాన్ని ఈ ట్రోలింగ్ ఎక్కువగా సతాయిస్తుంది. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై అక్కినేని అమల రియాక్ట్ (Amala reacts) అయ్యారు. ఏజెంట్ సినిమా మరియు అఖిల్ పై వస్తున్న ట్రోల్స్ కి స్పందిస్తూ అమల సినిమాలలో లోపాలు ఉన్నాయి అయినప్పటికీ సినిమాని బాగా ఎంజాయ్ చేశాను అని అన్నారు.
ఫిలిం ఇండస్ట్రీ అంటేనే ఏదో ఒక రకంగా గాసిప్ నడుస్తూ ఉంటుంది. అందరిని మనం మెప్పించాలి అంటే కుదిరే పని కాదు. ప్రస్తుతం ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది కానీ అది ఎందుకు చేస్తారు అనేది కూడా నాకు తెలుసు. నేను నిన్న ఏజెంట్ మూవీ ని చూశాను. సినిమా మొత్తం ఆస్వాదించాను. ప్రతి సినిమాలో లోపాలు ఉంటాయి కానీ మీరు ఈ మూవీ ను ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. నేను థియేటర్లో సినిమా చూసే టైంలో అక్కడ సగం మందికి పైగా లేడీస్ ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు అరుపులు కేకలతో వాళ్లు బాగా మూవీని ఎంజాయ్ చేశారు. ఇంకో మాట ఏమిటంటే…నెక్స్ట్ అఖిల్ చేయబోయే చిత్రం ఇంకా బాగుంటుంది అని నేను కచ్చితంగా చెప్పగలను.
నిజానికి ఈ మూవీలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ల కోసం అఖిల్ కష్టపడిన తీరుపై ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విలన్ రోల్ మరియు హీరోయిన్ తో లవ్ ట్రాక్ లాంటి అంశాలు కాస్త పేలవంగా ఉన్నట్లు ఫాన్స్ భావిస్తున్నారు అని ఆమె అన్నారు. స్క్రీన్ ప్లే పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అమల పేర్కొన్నారు. మొత్తానికి నెగిటివ్ టాక్ వచ్చిన ఏదో ఒక రకంగా అఖిల్ను పాజిటివ్ యాంగిల్ లో పెట్టడానికి అమల చూస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.