OTT News: ‘కుడి ఎడమైతే’: అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..!

0
1235
Amala Paul Introducing Video from Kudi Yedamaithe web series

Amala Paul: అమలాపాల్ – రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ‘కుడి ఎడమైతే” ఈ సిరీస్ ను జూలై 16 నుండి 100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ క్రమంలో ‘కుడి ఎడమైతే’ నుంచి అమలా పాల్ పాత్రకు సంబంధించిన ఇంట్రడ్యూసింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

‘కుడి ఎడమైతే” ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని తెలుస్తోంది. ఇందులో రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తుండగా.. రవి ప్రకాష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. ఎమోషన్స్ – థ్రిల్స్ – సైంటిఫిక్ ఎలిమెంట్స్ కలబోసిన ఈ టైమ్ లూప్ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 16న ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.