Ambati Arjun Bigg Boss 7 Wild Card Entry: ఉల్టా పుల్టా బిగ్ బాసూ ఏం జరుగుతోంది.. రెండో వారం వచ్చేస్తోంది.. ఉల్టా లేదు.. పుల్టా లేదు.. ఇలా మొదటి వారం నార్మల్ గా గేమ్ సాగింది. కానీ రెండో వారంలో కాస్త కోలుకుంది. ముఖ్యంగా నామినేషన్ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ 7 హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పంపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌లో అర్జున్ అంబటి పేరు బాగానే వినపడింది. కానీ తాను హౌస్ లోకి రాలేదు…
Ambati Arjun Bigg Boss 7 Wild Card Entry: అయితే ఇప్పుడు రెండు వారాల తర్వాత.. గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు.. అర్జున్ అంబటి వైల్డ్‌కార్డ్‌గా వస్తాడు అనే లీక్ బయటకు వచ్చింది. అతను వచ్చినప్పుడు ఆట కఠినంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ 7 హౌస్ లో సీరియల్ బ్యాచ్ అంటూ దండుపాళ్యం కి మించిన బ్యాచ్‌లా గ్రూప్ కట్టారు. ఒకే ఆట.. ఒకటే మాట అనే విదంగా వుంది. అర్జున్ అంబటి కూడా వస్తున్నాడు కాబట్టి, అతను కూడా సీరియల్ కాస్ట్‌లో జాయిన్ అవుతాడా? లేక… వ్యక్తిగతంగా పోటీలో పాల్గొంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి సీరియల్స్‌లోకి రాకముందు అర్జున్ చాలా సినిమాల్లో నటించాడు. అగ్నిసాక్షి కంటే ముందు అర్ధనారి సినిమాలో నటించాడు. అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత “దేశముదురు”, “సౌత్యం”, “అశ్వమేధం” వంటి చిత్రాల్లో కూడా నటించారు. దీని తరువాత “దేవత” సీరియల్ చేయటం జరిగింది . ఆ సీరియల్ హిట్ కావడంతో అర్జున్ కెరీర్ మలుపు తిరిగింది.
ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు పండగ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. కొత్త సీరియల్ ఏదీ ప్రారంభం కానందున, అర్జున్ అంబటి బిగ్ బాస్ ఆఫర్‌ను అంగీకరించి హౌస్‌లోకి వస్తునట్టు సమాచారం. అయితే తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ ఫోటో షేర్ చేశారు. నోటిఫికేషన్‌ల కోసం వేచి ఉండండి అంటూ బిగ్ బాస్ ఎంట్రీ గురించి హింట్ ఇవ్వడంతో.. ఇప్పటికే ఆలస్యం చేశారు.. వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నారు అర్జున్ అంబటి అభిమానులు.. మరి చూడాలి బిగ్ బాస్ 7 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తాడో లేదో..