Amigos Pre Release Business: టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ఫిబ్రవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న అమిగోస్ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ ఇప్పటికే కొన్ని వారాల క్రితం విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు అమిగోస్ మూవీ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది.
అమిగోస్ సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ ని 9 కోట్లు కి అమ్మినట్టు తెలుస్తుంది. దీంతో ప్రొడ్యూసర్స్ సినిమా విడుదలకు ముందే సినిమా పెట్టుబడి రికవరీ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.
ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ధియేటర్ హక్కులు సంబంధించినట్టు అలాగే డిజిటల్ రైట్స్ బిజినెస్ సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బింబిసార తో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అమిగోస్ లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.