Homeసినిమా వార్తలుహైదరాబాదులో ప్రభాస్ తో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ.. ఇదే కారణం

హైదరాబాదులో ప్రభాస్ తో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ.. ఇదే కారణం

Amit shah – Prabhas: వివరాలు సరిగ్గా తెలియదు కానీ బీజేపీ పెద్దలు ఇప్పుడు టాలీవుడ్ హీరోల మీద పడ్డారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి భోజనం చేయడం ఆ తర్వాత నితిన్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే బిజెపి కి సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయపరంగా కాదని వ్యక్తిగతంగా కలవటం మాత్రమేనని వివరణ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే అమిత్ షా మళ్లీ మన ఫ్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ని కలవడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారయ్యింది. ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 16న అమిత్ షా బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఇదే రోజున కృష్ణంరాజు సంస్మరణ సభ ఉండడంతో.. ఆ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు.

సెప్టెంబర్ 16న జరగనున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. కృష్ణంరాజుకు రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ తో బేటీ అవటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

ఈ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు మరణంతో శోకంలో ఉన్న ప్రభాస్ ని, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హైదరాబాద్ రానున్నారు. ప్రభాస్ తో అమిత్ షా భేటీ అవ్వనుండడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles