అమితాబ్ కు ఏమైంది.. ఎందుకా సంచలన వ్యాఖ్యలు

0
131
amitabh Bachchan comments on brahmastra movie
amitabh Bachchan comments on brahmastra movie

అమితాబ్ బచ్చన్.. భారత సినిమాకు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. డెబ్బయి ఏళ్ల వయసు.. సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఆయన షాకింగ్ కామెంట్స్ చేయడం.. చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. అదేంటనే కదా.. సినిమాల నుండి తప్పుకోవాలని అనిపిస్తోంది అని కామెంట్లు చేశారు.

మనసు ఉత్సాహపడుతున్నా శరీరం సహకరించడం లేదనీ.. బుర్ర ఒకటి ఆలోచిస్తోంది, చేతి వేళ్లు మరొక సందేశాన్నిస్తున్నాయని ఆయనే స్వయంగా తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. బహుశా నేను రిటైర్ కావాలని పరోక్షంగా అవి తెలియజేస్తున్నాయి అనుకుంటున్నానని.. నా శరీరం సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నానని చివర్లో తనకు నటన అంతే ఎంత ప్రాణమో తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ కు ప్రతి రోజూ బ్లాగ్ లో తనకు సంబంధించిన విషయాలను రాసుకునే అలవాటు.. ఇలా తాను రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నానని ఆయన కామెంట్లు చేయడంతో చాలా మంది అమితాబ్ తన నటనకు గుడ్ బై చెప్తున్నారేమోనని తెగ బాధపడిపోతున్నారు. అమితాబ్ బచ్చన్ కు ఆరోగ్యం కూడా సహకరించడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆయన క్షయ వ్యాధితో బాధపడుతున్నారు.

అమితాబ్ తెలుగులో సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించారు. నరసింహా రెడ్డి గురువు పాత్రలో ఆయన కనిపించారు. ఇక టాలీవుడ్ దర్శకుడు తేజ ఆర్టికల్ 370 ఆధారంగా ఓ కథ రాశారని ఫిలింనగర్ వర్గాల భోగట్టా..! ఈ సబ్జెక్టు ను బాలీవుడ్ జనాలు కూడా బాగా చూసే అవకాశం ఉన్నది. అందుకోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను సంప్రదించారట.. ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here