Amitabh Bachchan Father Role In OG Movie: పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మొదటి దగ్గర నుంచే ప్రొడ్యూసర్ అలాగే దర్శకుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
Amitabh Bachchan Father Role In OG Movie: ఈ సినిమాపై ఇంత హైప్ రావడానికి కారణం కూడా దీనిలో నటిస్తున్న నటీనటుగా కారణం. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా లో ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మితో పాటు ఇతర ఇండస్ట్రీ కి సంబంధించిన స్టార్స్ ప్రకాష్ రాజ్… అర్జున్ దాస్.శ్రేయ రెడ్డి లు ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఇదే కనుక నిజమైతే భోగి సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సంచలనాలను సృష్టించడం ఖాయం. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలోనే విడుదల చేస్తారన్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రెండు షెడ్డు కంప్లీట్ చేసుకోగా మూడో షెడ్డులు పవన్ కళ్యాణ్ లేకుండా హైదరాబాదు లొకేషన్స్ శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ సాహూ మాదిరిగానే సుజిత్ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా భారీ కాస్టింగ్ తీసుకున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.