Homeసినిమా వార్తలుHi Nanna Song:‘హాయ్ నాన్న’ నుంచి మెలోడీ అమ్మాడి పాట విడుదల.!

Hi Nanna Song:‘హాయ్ నాన్న’ నుంచి మెలోడీ అమ్మాడి పాట విడుదల.!

Ammaadi song released from the Hi Nanna Movie, Nani and Mrunal Thakur next Hi Nanna movie songs, Hi Nanna movie release date, Nani Next movie, Hi Nanna movie

Ammaadi song released from the Hi Nanna Movie, Nani and Mrunal Thakur next Hi Nanna movie songs, Hi Nanna movie release date, Nani Next movie, Hi Nanna movie

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు ఉంటాయి. అదేవిధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ కూడా డిఫరెంట్ జోనర్ సాంగ్స్ ఆల్బమ్‌ తో అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాట ఇప్పుడు విడుదలైంది.

మృణాల్ ఠాకూర్ తన థర్డ్ యానివర్సరీని రివిల్ చేస్తూ తన పెర్ ఫార్మెన్స్ తో పాట ప్రారంభమవుతుంది. “ఇది నా భర్తకు అంకితం చేస్తున్న చాలా ప్రత్యేకమైన పాట. అతను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’’ అంటూ మృణాల్ వాయిస్ తో పాట మొదలౌతుంది.

ఈ పాట నాని, మృణాల్‌ల స్వీట్, బ్యూటీఫుల్ ప్రేమకథను చూపిస్తూ పెద్ద వేడుకను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సోల్ ఫుల్ మెలోడీ.. వారి పెళ్లి రోజు నుండి, వివాహ ప్రారంభ రోజులలో వారు కలసివున్న అద్భుతమైన రోజుల వరకు, ప్రేమ యొక్క కొత్త అధ్యాయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో నాని, మృణాల్ డిలైట్ ఫుల్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది.

హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యే మరొక ప్లజెంట్ నంబర్‌ను అందించారు. మొదటి రెండు పాటల్లాగే ఇది కూడా ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్ సాంగ్ అవుతుంది. కృష్ణకాంత్ ఆకట్టుకునే, మీనింగ్ ఫుల్ లిరిక్స్ అందించారు. కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ వోలక్స్ ఎక్స్ ప్రెషివ్ గా వున్నాయి.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో బేబీ కియారా ఖన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సాను జాన్ వరుగీస్ ఐఎస్‌సి, ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ‘హాయ్ నాన్నా’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY