Homeసినిమా వార్తలు"బేబి" కాంబో రిపీట్..ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కొత్త సినిమా.!

“బేబి” కాంబో రిపీట్..ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కొత్త సినిమా.!

Anand Devarakonda next movie, Baby blockbuster combo repeat once again, Anand Devarakonda and Vaishnavi chaitanya new movie, Vaishnavi next movie, Vaishnavi hot images

Anand Devarakonda next movie, Baby blockbuster combo repeat once again, Anand Devarakonda and Vaishnavi chaitanya new movie, Vaishnavi next movie, Vaishnavi hot images

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది “బేబి” సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ సినిమాని సాయి రాకేష్ దర్శకత్వం చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద దాదాపు 70 కోట్లు వరకు షేర్ని రాబట్టిన ఈ సినిమా కాంబో మళ్లీ ఇప్పుడు రిపీట్ కాబోతుంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్,”కలర్ ఫొటో”తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

“బేబి” సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించి మెగాస్టార్ చిరంజీవి నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ కేఎన్ తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు.

నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్ లో థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY