ట్రైలర్ టాక్ : ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ ముచ్చట్లు !

0
280
Anand Devarakonda Middle Class Melodies Official Trailer talk

Middle Class Melodies Official Trailer: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ రెండో ప్రయత్నంగా ”మిడిల్ క్లాస్ మెలోడీస్” అనే చిత్రంతో వస్తున్నాడు. ‘చూసి చూడంగానే’ ‘జాను’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంతో వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. జనార్ధన్ పసుమర్తి ఈ సినిమాకి స్టోరీ మరియు డైలాగ్స్ రాశాడు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి.

కరోనా లాక్ డౌన్ లో ప్రకటించిన ఈ సినిమా అప్పుడే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే టైటిల్ కి తగ్గట్టే ఇందులో మిడిల్ క్లాస్ జీవితాలను చూపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు. అయితే గుంటూరులో హోటల్ ఏర్పాటు చేసిన రాఘవకు అనుకోని పరిణామాలు ఎదురైనట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ సగటు మిడిల్ క్లాస్ యువకుడిగా బాగా నటించినట్లు అర్థం అవుతోంది.

కాగా ఆనంద్ దేవరకొండ ”మిడిల్ క్లాస్ మెలోడీస్” చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు సుమారు 4 కోట్లకు తీసుకున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్ కి దాదాపు కోటీ యాభై లక్షలు వరకు ఖర్చు అయిందట. అయితే ఇప్పుడు ఈ సినిమాని 4 కోట్లకు అమెజాన్ కి అమ్మడం నిజమైతే దేవరకొండ మూవీ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా రిలీజ్ కి ముందే లాభాల్లో ఉన్నట్లే లెక్క.  ఏదేమైనా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అయితే ఆనంద్ దేవరకొండ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.