Latest Posts

బేబీ సినిమాకి అన్ని అవార్డులు అందుకున్న అనంత శ్రీరామ్!

- Advertisement -

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి లిరిక్స్ అందించి అనంత శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్ గా ఐఫా అవార్డ్ దక్కించుకున్నారు. ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఆయనకు ఐఫా అవార్డ్ సొంతమైంది. దీంతో బేబి సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్ గా అన్ని మేజర్ అవార్డ్స్ స్వీప్ చేశారు అనంత శ్రీరామ్.

ఈ అవార్డ్ తీసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ తో కలిసి అనంత శ్రీరామ్ ఫొటో తీసుకున్నారు. ఎస్ కేఎన్, సాయి రాజేశ్ అనంత శ్రీరామ్ ను అభినందించారు. బేబి సినిమాకు ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కుతున్నాయంటే ఆ ఘనత ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ సాయి రాజేష్ కే దక్కుతుంది. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్ లో బాలీవుడ్ లో బేబి సినిమా రీమేక్ అవుతోంది.

anantha sriram wins major awards for Baby movie
anantha sriram wins major awards for Baby movie
- Advertisement -

Latest Posts

Trending News

Related Articles