పుష్ప షూట్ లో జాయిన్ అయిన అనసూయ..!

0
39
Anasuya Bharadwaj joins the sets of Allu Arjun's Pushpa

Pushpa – Anasuya Bharadwaj: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” (Pushpa). సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అనేక హంగులతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అనసూయ (Anasuya) కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే అనసూయపై కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ పిక్చరైజ్ చేసారు.

మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 1 ఫైనల్ షెడ్యూల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్, రష్మికలపై (Rashmika Mandanna) కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ (Sukumar) తెరకెక్కించనున్నారు. అయితే ఈ షూట్ లో తాను కూడా మళ్ళీ పాల్గొనట్టుగా అనసూయ భరద్వాజ్ (Anasuya) తెలిపింది. తన ఇన్స్టా ద్వారా అనసూయ లొకేషన్ పిక్ తో షూట్ పై అప్డేట్ ఇచ్చేసింది.

ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా తనదైన నటనను ప్రదర్శించింది ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత కథానాయికగా కూడా అనసూయకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ భామ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. రీసెంట్‌గా ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో నటించింది.

Anasuya Bharadwaj joins the shoot of Allu Arjun's Pushpa

కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రంగ మార్తండలో (Ranga Maarthaanda) కూడా అనసూయ ఓ క్రేజీ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.