అనసూయకు మెగా ఆఫర్స్!

0
572

Anasuya Bharadwaj : బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మెగా క్యాంప్ సినిమాల్లో ఆమె ఖచ్చితంగా ఉంటోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆమె స్వయంగా ఈ విషయం ఖరారు చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాధర్ చిత్రంలో ఆమె ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనసూయ తనకు చిరంజీవిపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చిరంజీవి గారంటే ఆమెకు ఎంతో అభిమానం అని, ఆయన పేరు చెబితేనే భక్తితో కూడా మర్యాద కలుగుతుందని అన్నారు.

Hot Beauty Anasuya Bharadwaj Upcoming movies 2022

కాగా, అనసూయ మరోసారి సినీ ప్రియుల్ని అలరించనున్నట్లు సమాచారం. శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహాసముద్రం’లో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే చిత్రబృందం అనసూయను సంప్రదించినట్లు సమాచారం. దీంతో ‘మహా సముద్రం’లో అనసూయ భాగమైందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.