అనసూయ ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల

అనసూయ భరద్వాజ్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అటు బుల్లితెర మీద ఇటు వెండితెరమీద తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. సినిమా హిట్ లేదా ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనుసూయ ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఆదివారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది.

Anasuya first look poster from Wanted Pandu Gang Poster
Anasuya first look poster from Wanted Pandu Gang Poster

ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

Related Articles

Telugu Articles

Movie Articles