రవితేజ ‘ఖిలాడి’ కోసం అనసూయ..?

0
744
Anasuya Bharadwaj Will Appear With Special Charecter In Ravi Teja's Khiladi

Ravi Teja: Anasuya: ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా పవర్‌ఫుల్ రోల్‌తో ఆకట్టుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. హీరోయిన్ గా నటించకుండానే మంచి పాత్రల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న అనసూయ.. తాజాగా రవితేజ హీరోగా రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాలో అవకాశం దక్కించుకుందని టాక్.

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడి’గా తన అభిమానులను అలరించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.  అయితే ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కోసం అనసూయను తీసుకున్నారని తెలుస్తోంది.   ఆమెకు అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు ఆచార్య సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో ఈ ‘ఖిలాడి’ మూవీ రూపొందనుంది. ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ అతిత్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

Previous articleసమంతతో రౌడీ బాయ్ రచ్చ..!
Next articleఛార్మి 9 నెలల బేబీ బాయ్ తో ప్రభాస్ ఫొటో వైరల్!!