Anasuya Comments on Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అలాగే అనసూయ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విడుదల దగ్గర నుంచి జరిగిన వివాదం అందరికీ తెలిసినదే. అర్జున్ రెడ్డి ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన మాదర్ ** అనే బూతు పదం మీద యాంకర్ అనసూయ బహిరంగంగానే కామెంట్ చేయడం జరిగింది. తర్వాత విజయ్ కూడా పరోక్షంగా అనసూయ మీద ఆరోపణలు చేశారు. అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Anasuya Comments on Vijay Devarakonda: కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అనసూయ సోషల్ మీడియా ద్వారా సంబరాలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. లైజర్ సినిమా గురించి అనసూయ సోషల్ మీడియాలో ” అమ్మని తిట్టిన వారు ఎప్పుడు బాగుపడలేదు” అని అర్థం వచ్చేలాగా పరోక్షంగా చేసిన కామెంట్స్ ఆ టైంలో వైరల్ గా మారాయి. ఇప్పుడు యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) మళ్లీ విజయ (Vijay) మీద తన ట్విట్టర్ వేదికగా పరోక్షంగా కామెంట్ (Comment) చేయడం జరిగింది.
తను పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఇప్పుడే ఒకటి చూశాను.. ‘ది’నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం..’ అంటూ ట్వీటేసింది అనసూయ. విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ అలాగే సమంత ఖుషి టైటిల్ తో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు చివరి దశకు రావటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023
ఈ ప్రమోషన్ లో భాగంగా ఖుషి సినిమా నుండి విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మొదటి సాంగ్ ని విడుదలకు సిద్ధం చేశారు. ఈ మొదటి సంబంధించిన పోస్టర్లలో ‘ది విజయ్ దేవరకొండ’ అని పేరుని మేకర్స్ వెయ్యటం జరిగింది. ఇది చూసిన అనసూయ, తన ట్విట్ లో ‘ది’ అని పెట్టి షాకింగ్ కామెంట్ చేయటం జరిగింది. ఇప్పుడు దీనిపైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా అనసూయ పై ఫైర్ అవుతున్నారు. మరి అనసూయ అలాగే విజయ్ దేవరకొండ మధ్య రగిలిన ఈ వివాదం ఎప్పటికీ ముగిస్తుందో చూడాలి..
Web Title: Anasuya shocking Comments on Vijay Devarakonda