అనసూయ కొత్త సినిమా.. సిల్క్ స్మిత బయోపిక్?

0
374
Anchor Anasuya in Silk Smitha biopic

బుల్లితెరపై తన సత్తా చాటుతూ వచ్చిన హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినీనటిగా మారిన ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగా వస్తున్న ప్రతీ ఆఫర్ నూ అంగీకరించదు. పాత్ర తనకు నచ్చితేనే ఓకే చెబుతుంది. కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’చిత్రంలో రంగమ్మత్తగా దుమ్మురేపింది.

ఓ వైపు బుల్లితెరపై తన మార్క్ చాటుకుంటూనే వెండితెరపై రాణిస్తుంది. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న అనసూయ తాజగా తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. ‘మరో మంచి కథ.. కొత్త ఆరంభం .. కోలీవుడ్.. తమిళ్..’ అంటూ తాజాగా అనూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఓ ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఇందులో అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పోజు ఇచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతితో కలసి ఆమె నటించనుందని తెలుస్తోంది. ఈ మూవీ హిట్ అయితే తమిళనాట కూడా ఈ అమ్మడు సత్తా చాటుతుందంటున్నారు.

ఈ చిత్రం కోసమే ఇటీవల ఆమె చెన్నై వెళ్లినట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఒకప్పటి శృంగారతార సిల్క్ స్మిత బయోపిక్ గా రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Previous articleSamantha Stunning With Her Beauty
Next articleబాయ్ ఫ్రెండ్ తో రచ్చ.. లవ్ కన్ఫర్మ్ చేసిన పాయల్..!