తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి..!

0
1203
Anchor Sreemukhi Gives Clarity About Her Marriage

Anchor Sreemukhi Marriage: బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలోనూ తళుక్కుమంటున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రల్లోను రాణిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలం అయింది. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తుంది. చాలారోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీముఖి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను అని శ్రీముఖి. ప్రస్తుతం తన వయస్సు 28 సంవత్సరాలు అని అయితే 31 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లీ పీటలు ఎక్కాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది.