సహజమైన పాత్రలతో కూడిన ఎమోషనల్ డ్రామాస్ ను మన ఆడియన్స్ ఇష్టపడుతుండడంతో. అందులో భాగంగా పలువురు దర్శకులు మలయాళ హిట్ మూవీస్ ను రీమేక్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అలాంటి ఓ మల్లూ మూవీ ‘కప్పేళ’. ఇందులో అన్నా బెన్, రోషన్ మ్యాథ్యూస్, శ్రీనాథ్ భాసి ముఖ్యపాత్రలు పోషించారు. ఒక టీనేజ్ అమ్మాయి రాంగ్ కాల్ తో పరిచయమైన ఒక ఆటో డ్రైవర్ ను కలవడానికి ఇంట్లో వారికి తెలియకుండా వెళుతుంది. ఆటోడ్రైవర్ ముఖం కూడా చూడని ఆ అమ్మాయికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో అత్యంత సహజంగా రూపొందింది సినిమా.
ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అందులో ఒక హీరో గా నవీన్ చంద్ర ఎంపికవగా.. మరో హీరోగా విశ్వక్ సేన్ ను సంప్రదిస్తున్నారు మేకర్స్. అయితే ఒరిజినల్ వెర్షన్ లో అన్నాబెన్ పోషించిన పాత్ర కోసం మల్లూ గాళ్ అయిన అనిఖా సురేంద్రను సెలెక్ట్ చేసే ఆలోచనతో ఉన్నారు మేకర్స్. తమిళ్‌స్టార్ హీరో అజిత్ నటించిన ‘ఎంతవాడు గానీ’ సినిమా తెలుగు రీమేక్‌లో బాల నటిగా నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు కేరళ ప్రభుత్వం 2013లో ఉత్తమ బాలనటి అవార్డును బహూకరించింది. ఈమె అసలు పేరు అనికా సురేంద్రన్ అయితే.. మలయాళ చిత్ర పరిశ్రమకు ‘బేబీ అనికా’గానే గుర్తింపు.
ఓటీటీలో లాక్ డౌన్ కు ముందు విడుదలై.. మంచి విజయం సాధించిన ‘కప్పేళ’ సినిమా కథాంశం తెలుగు జనానికి కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలుండడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ‘ప్రేమమ్’, పవన్‌కల్యాణ్ నటించబోయే ‘అయ్యప్పనమ్ కోషియమ్’ నిర్మిస్తున్న అదే చిత్ర నిర్మాణ సంస్థే ‘కప్పేల’ సినిమా రీమేక్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.