Homeసినిమా వార్తలుభగవంత్ కేసరి కలెక్షన్ పై దర్శకుడు కామెంట్స్ వైరల్..!

భగవంత్ కేసరి కలెక్షన్ పై దర్శకుడు కామెంట్స్ వైరల్..!

Bhagavanth Kesari collection, Anil Ravipudi comments on Bhagavanth Kesari collection, Bhagavanth Kesari collection worldwide, Balakrishna, Sreeleela, Kajal Aggarwal.

Bhagavanth Kesari fake collection, Anil Ravipudi comments on Bhagavanth Kesari collection, Bhagavanth Kesari collection worldwide, Balakrishna, Sreeleela, Kajal Aggarwal.

దర్శకుడు అనిల్ రావిపూడి అలాగే బాలకృష్ణ మొదటిసారిగా కలిసిన కలిసి చేసిన సినిమా భగవాన్ కేసరి. అక్టోబర్ 19 న విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రాబట్టటంలో దర్శకుడు అలాగే బాలకృష్ణ విజయాన్ని సాధించారనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ (Collections) వద్ద ఈ సినిమా కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుంది.

ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ అయినా షైన్ స్క్రీన్స్ ప్రతిరోజు కలెక్షన్స్ సంబంధించిన ఆఫీషియల్ పోస్టర్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర నుండి బాక్సాఫీస్ కలెక్షన్స్ అలాగే సినిమా టాక్ మేనేజ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో అలాగే వెబ్ మీడియాలో కూడా కథనాలు నడుస్తున్నాయి.

భగవంతు కేసరి సక్సెస్ టూర్ లో అనిల్ రావిపూడి అలాగే హీరోయిన్ శ్రీ లీల జిల్లాల వారీగా కొన్ని థియేటర్లను సందర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే సినిమాకు సంబంధించిన ఫేక్ కలెక్షన్స్ గురించి దర్శకుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. భగవంత్ కేసరి టీమ్ అధికారికంగా విడుదల చేసిన కలెక్షన్స్ ఏమాత్రం అతిశయోక్తి కాదని, అసలైన నంబర్‌లను పోస్ట్ చేస్తున్నాయని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అన్నారు.

మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, అతను కలెక్షన్ల గురించి మాట్లాడుతూ.. భగవంత్ కేసరి బాక్సాఫీస్ నంబర్లు ఫేక్ కాదని.. అలాగే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే ప్రొడ్యూసర్లు మానేజ్ చేయడం లేదని.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు అంటూ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ నిజమైనవి అని చెప్పుకు రావటం జరిగింది..