Anil Ravipudi next movie with Ram pothineni after Mahesh Babu Sarileru Neekevvaru-min
Anil Ravipudi next movie with Ram pothineni after Mahesh Babu Sarileru Neekevvaru-min

అనిల్ రావిపూడి.. వరుస విజయాలతో దూసుకొని వెళ్తున్నాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్-2.. లాంటి సినిమాల హిట్స్ తర్వాత మహేష్ బాబు ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అనిల్ రావిపూడి. మహేశ్ బాబు – రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఎంతో మంది దర్శకులు అడిగినా ఒప్పుకోని లేడీ అమితాబ్ విజయ్ శాంతి కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మహేష్ బాబు టీజర్ దక్షిణాదిన రికార్డులు సృష్టిస్తోంది. అక్కడితో ఆగిపోకూడదని చిత్ర బృందం కూడా భావిస్తోంది. ప్రతీ వారం సందడి చేయాలని భావిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా కోసం ప్రతి సోమవారం ఏదో ఒక అప్ డేట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. పోస్టర్లు, పాటలు, వీడియో క్లిప్పింగ్స్ వంటివి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే డీఎస్పీ ఎలా సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటారా అని అభిమానుల్లో కాస్త క్యూరియాసిటీ ఉంది. సంగీతంపైన భారీగా అంచనాలు ఉండడంతో దేవిశ్రీ ప్రసాద్ మీద పెద్ద బాధ్యత ఉన్నట్లే..!

ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమా కూడా అనిల్ రావిపూడి పక్కా క్లారిటీతో ఉన్నాడు. అనిల్ హిట్ రికార్డు చూసి ఏ హీరో అయినా ఓకె చెప్పడానికి రెఢీగా ఉంటాడు. అయిత్ అనిల్ రావిపూడి హీరో ‘రామ్’ ను సెలెక్ట్ చేసుకున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో రామ్ ఎందుకు అన్న డౌట్ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా.. చివరి నిమిషం లో క్యాన్సిల్ అయింది. అందుకే అనిల్ రావిపూడి రామ్ తోనే చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ సినిమాను రామ్ తోనే చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. అనిల్ మరో క్రేజీ స్టోరీతో రామ్ ను కలిసి ఒక కథ వినిపించగా వెంటనే రామ్ ఓకె చెప్పేసినట్లు తెలుస్తోంది. రామ్ చేస్తున్న ‘రెడ్’ సినిమా షూటింగు పూర్తి అవ్వగానే.. రామ్-అనిల్ రావిపూడి సినిమా మొదలు కానుంది.