‘ఎఫ్‌ 3’కి భారీ బడ్జెట్‌.. ఓకే చెప్పిన దిల్ రాజు.. ‘F2’తో పోలిస్తే రెండింతలు

0
1304
Anil Ravipudi, Venkatesh, Varun Tej F3 Film Budget Rs 70 Crore

F3 Movie Budget: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్‌ 3 డిసెంబర్‌ 14న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘F2’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరితో పాటు మరికొందరు ఎఫ్‌ 3లో నటించనున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రేక్షకుల చేత మరింత నవ్వులు పూయిస్తుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ వెల్లడించారు.

కాకపోతే, ‘F2’కి మించిన వినోదం ‘F3’లో ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

‘F2’ సినిమాను నిర్మాత దిల్ రాజు సుమారు రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం ఏకంగా రూ.81 కోట్ల థియేట్రికల్ షేర్‌ను వసూలు చేసింది. దిల్ రాజు కెరీర్‌లో అత్యధిక లాభం చేకూర్చిన సినిమా ఇది. అందుకే, అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ‘F3’ సినిమాకు బడ్జెట్‌ను డబుల్ చేశారట దిల్ రాజు. ఇక అందులో ప్రధాన హీరోలైన వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు రూ.12కోట్ల చొప్పున ముట్టనుందని.. అలాగే తమన్నాకు 1.5కోట్లు, మెహ్రీన్‌కి 70లక్షలు, అనిల్‌ రావిపూడికి 9 కోట్లు, దేవీ శ్రీ ప్రసాద్‌కి 2 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం.

అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని టాక్. ఇక ‘F2’, ‘వెంకీ మామ’ సినిమాలతో జోరందుకున్న వెంకటేష్ కూడా తన పారితోషికాన్ని స్వల్పంగా పెంచారట. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పెంచినట్టు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కాగా టాలీవుడ్‌లో సీక్వెల్‌లు విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. బాహుబలి మినహా మిగిలిన ఏ సీక్వెల్‌లు అంత విజయాన్ని సాధించలేదు. అనిల్‌ కథపై ఉన్న నమ్మకంతో ఈ సీక్వెల్‌కి దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఈ వార్తల్లో నిజం ఉందో లేదో!

Previous articleప్రకాష్ రాజ్‌పై నిప్పులు చెరిగిన నాగబాబు
Next articleఖరీదైన విల్లా కొనుకున్న సుకుమార్.. ఎంతో తెలుసా ?